ETV Bharat / state

'నేను2' పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

నరాల సుధాకర్ రాసిన నేను2 పుస్తకాన్ని హైదరాబాద్​లోని తన కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని తనకు అంకితం ఇవ్వడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

author img

By

Published : Nov 5, 2020, 5:59 PM IST

mlc-kavitha-inaugurated-the-book-nenu2-at-hyderabad
'నేను2' పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

మనిషి తనను తాను పరిశీలించుకోవడం, అర్థం చేసుకోవడం గొప్ప లక్షణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తనలోకి తాను చూసుకో గలిగితే ధైర్యం, సాహసం, కరుణ, మానవత్వం మనిషికి అలవడతాయన్నారు. హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులోని తన కార్యాలయంలో నరాల సుధాకర్ రాసిన "నేను 2" అనే కవితా సంపుటిని ఆమె ఆవిష్కరించారు.

సామాజిక సేవ, ఆధ్యాత్మికత, సాహిత్య సాంస్కృతిక సేవ, ప్రకృతి పరిశీలన, మానవ పరిణామాలు అంశాలుగా కవిత్వం రాసిన నరాల సుధాకర్ తెలంగాణ సాహిత్య రంగంలో తనకంటూ శైలిని ఏర్పరుచుకున్నారని ఆమె అభినందించారు.

ఈ పుస్తకాన్ని తనకు అంకితం ఇవ్వడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. తొలి ప్రతి ప్రముఖ కవి నర్సింహారెడ్డి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్, జిల్లా అధ్యక్షుడు అవంతి రావు, సాహిత్య విభాగం అధ్యక్షుడు తిరుమల శ్రీనివాసార్య, దశరథ్ కొత్మీర్కర్, కొయ్యడ శంకర్, తంగళ్ళపల్లి నరేష్ చారి, సురేష్, హనుమాన్లు, నరాల స్వప్న, మోహన సాయి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన మండలి సభ్యురాలుగా విజయం సాధించినందుకు సంఘం కవితను ఘనంగా సన్మానించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.