ETV Bharat / state

సుపరిపాలన అందిస్తోన్న తెరాసకే ఓటేయండి: ఎమ్మెల్సీ కవిత - Hyderabad news

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలోని ఓ హోటల్​లో జాగృతి లీగల్ సెల్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవిత జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

సుపరిపాలన అందిస్తోన్న తెరాసకే ఓటేయండి: ఎమ్మెల్సీ కవిత

author img

By

Published : Nov 26, 2020, 8:20 PM IST

గ్రేటర్ హైదరాబాద్​ ఎన్నికల్లో కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సామాన్యులు తీవ్ర గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలోని ఓ హోటల్​లో జాగృతి లీగల్ సెల్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవిత జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

సుపరిపాలన అందిస్తున్న తెరాస విజయానికి కృషి చేయాలని ఆమె విన్నవించారు. ఓటర్లను చైతన్య పరచడానికి న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అనేక రాజ్యాంగ ఉల్లంఘనలు చేసిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కేంద్రం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై న్యాయవాదులు ప్రత్యేకంగా అధ్యయనం చేయడానికి చర్చా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదీ చూడండి: 'కేంద్రమంత్రులరా వెల్​కం టూ హైదరాబాద్... పైసలు తీసుకొనిరండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.