దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల తర్వాతనైనా సీఎం కేసీఆర్‌కు కనువిప్పు కలగాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఎవరు గెలిచారు అనే దాని కంటే తెరాస ఓటమికి కృతనిశ్చయంతో... ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఏకపక్షంగా నిలిచినట్లు భావించక తప్పదన్నారు.
సీఎం కేసీఆర్ కేవలం ప్రచార ఆర్భాటాలు, ప్రకటనలు హామీలకే పరిమితం కాకుండా అమలు చేయాలన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా ప్రభుత్వం పనిచేయాలని ఆశిస్తున్నట్లు జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'మరో 5 రోజులు మాత్రమే ఉంది... బకాయిలు కట్టండి'