ETV Bharat / state

'వరదల నష్టానికి కేసీఆరే పరిహారం చెల్లించాలి' - గాంధీ భవన్​ లేటెస్ట్ వార్తలు

హైదరాబాద్​లో కురిసిన వర్షాలకు కలిగిన నష్టానికి పూర్తి బాధ్యత తెరాస ప్రభుత్వమే తీసుకోవాలని గాంధీభవన్​లో ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి డిమాండ్​ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియం చెల్లించకపోవడం వల్లే రైతులకు పంట నష్టపరిహారం అందట్లేదని ఆయన ఆరోపించారు.

mlc jeevan reddy on rains in hyderabad
'వరదల వల్ల కలిగిన నష్టానికి సీఎం కేసీఆరే పరిహారం చెల్లించాలి'
author img

By

Published : Oct 20, 2020, 4:08 PM IST

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్​లో ఇళ్లు కూలిపోయిన వారికి గృహాలను ప్రభుత్వమే కట్టించాలని.. తీవ్రంగా నష్టపోయిన వరి, పత్తి, మొక్కజొన్న రైతులకు ఎకరాకు రూ. 20 వేల లెక్కన పరిహారం చెల్లించాలని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి హైదరాబాద్​ గాంధీభవన్​లో డిమాండ్​ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియం చెల్లించకపోవడం వల్లే రైతులకు పంట నష్టపరిహారం అందట్లేదని ఆయన ఆరోపించారు. పంట కొనుగోలులో ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని, రంగు మారినా ధాన్యాన్ని కొనాలని విజ్ఞప్తి చేశారు.

ఏకధాటి వర్షాలతో రాష్ట్రమంతటా అతలాకుతలమవుతున్నా.. సీఎం కేసీఆర్​ ప్రగతిభవన్​ దాటి బయటకు రావట్లేదని.. ఆమాత్రం ఓపిక కూడా ముఖ్యమంత్రికి లేదా అంటూ ఎద్దేవా చేశారు. సన్నరకం వరి పండించాలని ఆంక్షలు విధించారని.. ఇప్పుడు ఆ ధాన్యాన్ని కొనే బాధ్యత కూడా సీఎందేనంటూ జీవన్​రెడ్డి అన్నారు. తెలంగాణలో వరదల పరిస్థితిని కేంద్రానికి నివేదించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. కేసీఆర్​ కనీసం ఏరియల్​ సర్వే అయినా చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: తాడ్వాయిలో ఎదురుకాల్పులు... ఇద్దరు మావోయిస్టులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.