రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారత భవన్లో రజక సంఘాల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం రానున్న బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించేందుకు పాటుపడతానని హామీ ఇచ్చారు.
రజకులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలంటే అన్ని రజక సంఘాల నాయకులు ఏకతాటిపైకి రావాలని బస్వరాజ్ సారయ్య అన్నారు. వెనుకబడిన కులాల ప్రతినిధిగా తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రజకుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి.. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'సభ్యత్వ నమోదులో నియోజకవర్గాన్ని మొదటిస్థానంలో నిలపాలి'