ETV Bharat / state

నిరుద్యోగులకు తీరని అన్యాయం: శ్రీధర్ బాబు

author img

By

Published : Sep 22, 2019, 11:50 PM IST

తెలంగాణ వచ్చాక భారీ ఉద్యోగ నియమకాలు జరుగుతాయని కలలు కన్న యువకులను రాష్ట్రప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను ప్రభుత్వం త్వరగా అమలయ్యేలా చూడాలన్నారు.

నిరుద్యోగులను నిండా ముంచిన కేసిఆర్: శ్రీధర్ బాబు
నిరుద్యోగులను నిండా ముంచిన కేసిఆర్: శ్రీధర్ బాబు

అసెంబ్లీలో తాము అడిగే ప్రశ్నలకు సమాధానం వస్తుందని ఆశించామని, కానీ తమ ఆశలన్నీ ఆడియాశలయ్యాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఉద్యమ సమయంలో పోరాడిన యువత కోసం రాష్ట్రం ఏర్పడ్డాక.... భారీ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని హైదరాబాద్‌లో మండిపడ్డారు. యువ న్యాయవాదుల స్టైయిఫండ్‌పై... సభలో ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆక్షేపించారు. సాగునీటి ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన వారికి పరిష్కారం లభించలేదని విమర్శించారు. విభజన చట్టంలోని పెండింగ్‌ హామీలు అమలయ్యే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానితో మాట్లాడాల్సిన అవసరం ఉందని శ్రీధర్‌ బాబు సూచించారు.

ఇవీచూడండి: ప్రజాభిప్రాయాలకు ప్రతిబింబంగా అసెంబ్లీ..: మంత్రి ప్రశాంత్ రెడ్డి

TG_Hyd_52_22_MLA_Sridharbabu_AB_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్ సీఎల్పీ కార్యాలయం OFC నుంచి వచ్చింది. ( ) అసెంబ్లీలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం వస్తుందని ఆశించామని తమ ఆశలన్నీ ఆడియాశలయ్యాయని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు.రాష్ట్రం ఏర్పడిన నుంచి గ్రూప్ ఉద్యోగాలు డీఎస్సీ నోటిఫికేషన్లు లేవని విమర్శించారు. యువ న్యాయవాదుల స్టైయిఫండ్ గురించి ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆక్షేపించారు. విభజన చట్టం హామీలను పెండింగ్‌లో ఉన్నాయని... ఆ హామీలు అమలయ్యే విధంగా ప్రధానితో మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రాజెక్టుల భూములు కోల్పోయిన వారికి పరిష్కారం లభించలేదన్నారు. బైట్: శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.