ETV Bharat / state

MLA SRIDHAR BABU: బరిలో ఎవరూ నిలిచినా... గెలిపించేందుకు కృషి చేస్తా - mla sridhar babu comments on huzurabad congress candidate

హుజూరాబాద్​ ఎన్నిక కోసం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై సోమవారం గాంధీ భవన్​లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఆ చర్చకు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్​ బాబు హాజరుకాకపోవడంపై పలు ఊహాగానాలు వినిపించాయి. ఆ వార్తలను శ్రీధర్​ బాబు ఖండించారు.

MLA SRIDHAR BABU
శ్రీధర్​ బాబు
author img

By

Published : Aug 31, 2021, 11:53 AM IST

కాంగ్రెస్ కమిటీ హుజూరాబాద్ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని... మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అభ్యర్థి ఎవరైనా... వారి గెలుపు కోసం పని చేస్తానని వెల్లడించారు. ఇదే విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డికి కూడా తెలియజేసినట్లు పేర్కొన్నారు.

అసెంబ్లీలో ప్రజాపద్దుల కమిటీ సమావేశం ఉన్నందునే సోమవారం గాంధీభవన్​లో జరిగిన సమావేశానికి హాజరు కాలేకపోయానని స్పష్టం చేశారు. అభ్యర్థి ఎంపిక విషయంలో స్థానికు నాయకులు, స్థానిక పరిస్థితుల ఆధారంగానే నివేదిక ఇచ్చారని తెలిపారు. కానీ తుది నిర్ణయం తీసుకునే వెసులుబాటు పీసీసీ అధ్యక్షుడికే ఉంటుందన్నారు. సెప్టెంబర్ 10 నాటికి హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: PCC MAHESH: 'హుజూరాబాద్​ ఎన్నికల కోసం కాంగ్రెస్​కు ఐదుగురు అభ్యర్థులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.