ETV Bharat / state

'రాష్ట్రపతి' ఓటింగ్‌లో ఎమ్మెల్యే సీతక్క పొరపాటు.. చేసేదేమీలేక..!

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్​లో ఎమ్మెల్యే సీతక్క ఓటుహక్కు వినియోగించుకున్న సందర్భంలో స్వల్ప అయోమయం చోటుచేసుకొంది. బ్యాలెట్ పత్రంపై ఇంక్​ పడటంతో మరో బ్యాలెట్​ ఇవ్వాల్సిందిగా సీతక్క అధికారులను కోరారు. ఇందుకు ఈసీ నిరాకరించడంతో చేసేదేమీలేక అదే బ్యాలెట్​ పత్రాన్ని బాక్సులో వేసి వెళ్లిపోయారు.

'రాష్ట్రపతి' ఓటింగ్‌లో ఎమ్మెల్యే సీతక్క పొరపాటు.. చేసేదేమీలేక..!
'రాష్ట్రపతి' ఓటింగ్‌లో ఎమ్మెల్యే సీతక్క పొరపాటు.. చేసేదేమీలేక..!
author img

By

Published : Jul 18, 2022, 1:42 PM IST

'రాష్ట్రపతి' ఓటింగ్‌లో ఎమ్మెల్యే సీతక్క పొరపాటు.. చేసేదేమీలేక..!

రాష్ట్ర శాసనసభలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే స్వల్ప అయోమయం చోటుచేసుకొంది. బ్యాలెట్ పత్రంపై ఓటు వేసిన అనంతరం కంపార్ట్​మెంట్​ వద్ద సీతక్క ఎక్కువ సమయం తీసుకున్నారు. అధికారులను ఏదో అడిగే ప్రయత్నం చేశారు. అది గమనించిన కాంగ్రెస్ ఏజెంట్ మహేశ్వరరెడ్డి.. ఏదైనా అనుమానం ఉంటే మరో బ్యాలెట్ పత్రం తీసుకోవాలని సూచించారు.

దీంతో సీతక్క మరో బ్యాలెట్ పత్రం ఇవ్వాలని సహాయ రిటర్నింగ్ అధికారిని కోరారు. ఎన్నికల పరిశీలకుడు, సహాయ రిటర్నింగ్ అధికారులు ఉన్నతాధికారులు ఈసీని సంప్రదించారు. ఆ సమయంలో సీతక్క అక్కడే నిరీక్షించారు. కొత్త బ్యాలెట్ పత్రం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో మొదటి బ్యాలెట్ పత్రాన్నే బ్యాలెట్ బాక్సులో వేశారు.

అయితే ఓటు వేయడంలో ఎలాంటి తప్పులు దొర్లలేదని సీతక్క పేర్కొన్నారు. బ్యాలెట్ పేపర్​పై ఇంక్ పడటంతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వమంటే ఇవ్వలేదని, ఇంక్ పడిన బ్యాలెట్ పేపర్​నే బాక్సులో వేసినట్లు తెలిపారు. ఆత్మసాక్షిగా తాను వేయాల్సిన వారికే ఓటు వేసినట్లు సీతక్క వివరించారు.

ఓటు వేయడంలో ఎలాంటి తప్పులు దొర్లలేదు. ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్‌ఇంక్ బ్యాలెట్ పేపర్‌పై పడింది. దాంతో అధికారికి ఫిర్యాదు చేశా. కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇంక్ పడిన బ్యాలెట్ పేపరే బాక్స్‌లో వేశా. నా ఆత్మసాక్షిగా నేను వేయాల్సిన వారికే ఓటు వేశా. ఓటు వేయడంలో ఎలాంటి గందరగోళం లేదు.-సీతక్క, కాంగ్రెస్​ ఎమ్మెల్యే

ఇవీ చూడండి..

శాసనసభలో కొనసాగుతోన్న రాష్ట్రపతి పోలింగ్​.. ఓటేసిన కేటీఆర్

'రాష్ట్రపతి ఎన్నిక' పోలింగ్​ షురూ.. వీల్​ఛైర్​లో వచ్చి ఓటేసిన మన్మోహన్​ సింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.