రేవ్ పార్టీ చేస్తున్న వారిని పట్టుకున్న రాచకొండ పోలీసులను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అభినందించారు. ఇలాంటి పార్టీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీకి విజ్ఞప్తి చేశారు.
రేవ్ పార్టీల వల్ల యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలుగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు ఏం చేస్తున్నారో గమనించి తల్లిదండ్రులు వారిని సక్రమ మార్గంలో నడిపించాలని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: పట్నం వీడి... శివారు ప్రాంతాలకు పాకిన రేవ్ పార్టీ కల్చర్