తెరాసపై పోరాడడానికి నాయకత్వం వహించేందుకు తాను సిద్ధమని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్‌ను గద్దె దింపే పనిలో తానే ముందుంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపాల కారణంగానే.. కేసీఆర్ రెండుసార్లు గెలుపొందారని ఆరోపించిన ఆయన తమ పార్టీలో మంచి వారికి టికెట్లు ఇచ్చి ఉంటే పార్టీ గెలుపొందేదన్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయం ఆధారంగా కాంగ్రెస్‌లో ఉండి పోరాడాలా లేక భాజపానా లేక మరో కొత్త పార్టీనా అన్నది కాలమే నిర్ణయిస్తుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాను డెబ్బై ఏళ్ల ముసలోన్ని కాదని ఇంకా 20 సంవత్సరాలపాటు రాజకీయాల్లో ఉంటానని పేర్కొన్నారు.
తెరాసలో కూడా చాలా మంది అసంతృప్తులు ఉన్నారని ప్రకటించారు. తాము రెడీ అంటే తెరాస ఖాళీ అవుతుందన్నారు. త్వరలో తెరాసలో సునామీ వస్తుందన్న రాజగోపాల్ రెడ్డి.. పైరవీలతో దిల్లీ నుంచి వచ్చేవారు నాయకులు కారని, ప్రజల నుంచి నాయకుడు పుట్టుకురావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: అపరిశుభ్ర పరిసరాల మధ్య నాగర్కర్నూల్ కలెక్టరేట్