ETV Bharat / state

'కేసులు ఎదుర్కోవడం నాకు కొత్త కాదు.. ఆ విషయం జోయల్‌ డేవిస్‌కు బాగా తెలుసు'

Raghunandan Rao Jubilee Hills Case: జూబ్లీహిల్స్‌లో బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో బాధితురాలి ముఖం ఎక్కడా చూపెట్టలేదని ఎమ్మెల్యే రఘునందన్‌రావు తెలిపారు. బాలిక ఫొటోలు తాను విడుదల చేయకముందే అన్ని టీవీల్లో దృశ్యాలు వచ్చాయని ఆయన అన్నారు.

రఘునందన్‌రావు
రఘునందన్‌రావు
author img

By

Published : Jun 6, 2022, 10:38 PM IST

Raghunandan Rao Jubilee Hills Case: జూబ్లీహిల్స్‌లో బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనకు సంబంధించి బాధితురాలి ఫొటోలు తాను విడుదల చేయకముందే అన్ని టీవీల్లో దృశ్యాలు వచ్చాయని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు వెల్లడించారు. అంతేకాకుండా తాను బాలిక పేరు ఎక్కడా చెప్పలేదని, ముఖం కూడా చూపెట్టలేదని స్పష్టం చేశారు. ఈ కేసు నుంచి ఎంఐఎం నాయకులను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అసలు దోషులను తప్పించాలనే దుర్మార్గమైన కుట్ర జరుగుతోందని రఘునందన్‌రావు విమర్శించారు.

కేసులు ఎదుర్కోవడం తనకు కొత్త కాదని డీసీపీ జోయల్‌ డేవిస్‌కు ఆ విషయం బాగా తెలుసని అన్నారు. తన తప్పుంటే కేసు పెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్ మాజీ మంత్రులు మాట్లాడుతుంటే నవ్వొస్తుందని.. వారు మానసిక ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయడంలేదని కాంగ్రెస్‌ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.

మైనర్ బాలికకు న్యాయం చేయాలంటే ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు అరెస్టు కోసం ఆందోళన చేయాలన్నారు. తాను భాజపాలో చేరిన తర్వాత ఎక్కడా కేసులు వాదించలేదని చెప్పారు. తెరాస, మజ్లిస్‌, కాంగ్రెస్‌ కలిసి తన మీదకు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. తాను హోంమంత్రి మనవడి గురించి ఎక్కడా మాట్లాడలేదని తెలిపారు. ఎలాంటి వీడియోలు బయటపెట్టలేదని ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పష్టం చేశారు.

"జూబ్లీహిల్స్ ఘటనలో నేను బాలిక పేరు చెప్పలేదు. అత్యాచారానికి గురైన బాధితురాలి ముఖం కూడా చూపెట్టలేదు. మజ్లిస్‌ నాయకులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఫొటోలు విడుదల చేయక ముందే టీవీల్లో విజువల్స్‌ వచ్చాయి. అసలు దోషులను తప్పించాలనే దుర్మార్గమైన కుట్ర. కేసులు ఎదుర్కోవడం నాకు కొత్త కాదు.హోంమంత్రి మనవడి గురించి ఇంకా మాట్లాడలేదు. హోంమంత్రి మనవడి వీడియోలు ఇంకా బయటపెట్టలేదు." - రఘునందన్‌రావు భాజపా ఎమ్మెల్యే

ఇదీ చదవండి: జూబ్లీహిల్స్​ అత్యాచారం కేసు.. ఈనెల 28 నుంచి ఇప్పటిదాకా...

కాశీ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారికి ఉరిశిక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.