ETV Bharat / state

Raghunandan: కాంగ్రెస్​ను తాకట్టు పెట్టేందుకే ప్రగతి భవన్​కు వెళుతున్నారు: రఘునందన్​ - mla raghunandan fired on balka suman in press meet

హుజూరాబాద్​లో నిన్న జరిగిన ఎమ్మెల్యే బాల్క సుమన్​ మీడియా సమావేశంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ విమర్శలు గుప్పించారు. సిద్దిపేట, గజ్వేల్​, సిరిసిల్ల నియోజకవర్గాలకు తప్ప మరే నియోజకవర్గానికి పారదర్శకంగా నిధులు మంజూరు కాలేదని ఆరోపించారు. ఇంతవరకూ హుజూరాబాద్​కు ఒక్క డబుల్​ బెడ్​ రూమ్​ కూడా మంజూరు కాలేదని అన్నారు. సుమన్ ఒక్కడే తెలంగాణ కోసం ఉద్యమం చేయలేదని.. ఎంతోమంది బలిదానాలతో రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ఈ మేరకు నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్​ విలేకరుల సమావేశం నిర్వహించారు.

mla raghunandan fired on balka suman
సుమన్​పై ఎమ్మెల్యే రఘునందన్​ ఫైర్​
author img

By

Published : Jun 25, 2021, 5:39 PM IST

రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎన్నికలో రోజుకో వాదంతో ప్రజల ముందు తెరాస సరికొత్త వివాదాలను తీసుకువస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు ఆరోపించారు. తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికలు రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ సీమాంధ్ర సెంటిమెంట్​తో ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానన్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. తెరాసకు భాజపా బీ టీం అన్న కాంగ్రెస్ నాయకులు కేసీఆర్​ను ఎలా కలుస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడేళ్ల నుంచి దొరకని అపాయింట్​మెంట్ ఇప్పుడు ఎలా వచ్చిందని ప్రశ్నించారు.

నువ్వు బానిసవా.?

ఎమ్మెల్యే బాల్క సుమన్..​ నువ్వు తెరాసకు బానిసవా.? తెలంగాణలో అభివృద్ధి, ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా.? ట్రబుల్ షూటర్ అని చెప్పుకునే వ్యక్తి దుబ్బాకలో విఫలమయ్యాడు.. ఇప్పుడు తెరాస నేతలు ఎవరికి వారే ట్రబుల్ షూటర్​గా ఫీలవుతున్నారు. దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఫలితాలతోనే సీఎం కేసీఆర్​ బయటకు వచ్చి సభలు పెడుతున్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో సీమాంధ్ర ఓటర్ల సానుభూతి పొంది.. ఇప్పుడు వారితో అవసరం తీరాక విమర్శలు గుప్పిస్తున్నారు. ఆంధ్రావాళ్లు లంకలో పుట్టిన రాక్షసులని ఎద్దేవా చేసిన మీరు.. ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులన్నీ వాళ్లకే ఎందుకు అప్పగిస్తున్నారు.?

రఘునందన్​ రావు, దుబ్బాక ఎమ్మెల్యే

పార్టీని తాకట్టు పెట్టుకుంటున్నారు

కాంగ్రెస్​ను తాకట్టు పెట్టేందుకే ప్రగతి భవన్​కు వెళుతున్నారు: రఘునందన్

హుజురాబాద్​లో తెరాసకు బీ టీంగా పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రగతి వెళ్తున్నారా అని రఘునందన్​ ఎద్దేవా చేశారు. నాగార్జున సాగర్​లో బలమైన ప్రత్యర్థి ఉన్నా.. కాంగ్రెస్​ గెలవలేదని, అందుకే సీఎం కేసీఆర్​కు ఆ పార్టీ నాయకులు అమ్ముడుబోయారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ముక్కలు అవుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్​ను తాకట్టు పెట్టేందుకే ప్రగతి భవన్​కు వెళుతున్నారని అభిప్రాయపడ్డారు.

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను ప్రచారం చేసి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని.. ఇప్పటికైనా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు. తెరాస ఎన్ని ప్రయత్నాలు చేసినా దుబ్బాక ఫలితమే పునరావృతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: Corona Third Wave: కరోనాపై పోరుకు అధునాతన కమాండ్​ కంట్రోల్​ కేంద్రం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.