ETV Bharat / state

'పచ్చదనాన్ని పెంపొందించడానికి అంకితభావంతో కృషి చేయాలి'

author img

By

Published : Jul 22, 2020, 5:21 PM IST

హైదరాబాద్​ గాంధీనగర్ డివిజన్​లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన సురభి పార్క్​లో శాసనసభ్యులు ముఠాగోపాల్​ మొక్కలు నాటారు. నగరంలో పెరుగుతున్న కాలుష్య నివారణకు విరివిగా మొక్కలు నాటి... వాటి సంరక్షణకు బాధ్యతగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

mla muta gopal participated in harithaharam program

ప్రజలు పచ్చదనాన్ని పెంపొందించడానికి అంకితభావంతో కృషి చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్​ గాంధీనగర్ డివిజన్​లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన సురభి పార్క్​లో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, కార్పొరేటర్ ముఠా పద్మతో కలిసి మొక్కలు నాటారు.

ముషీరాబాద్ నియోజకవర్గాన్ని పచ్చదనంగా తీర్చిదిద్దడానికి నాయకులు కార్యకర్తలు సమష్ఠిగా కృషి చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. నగరంలో పెరుగుతున్న కాలుష్య నివారణకు విరివిగా మొక్కలు నాటి... వాటి సంరక్షణకు బాధ్యతగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సర్కిల్ 15 ఉప కమిషనర్ ఉమా ప్రకాశ్​, ఎయంహెచ్ఓ హేమలత తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: గాలి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం: సీఎస్​ఐఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.