లాక్డౌన్ సమయంలో దాతలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ కోరారు. ఉపాధి కోల్పోయిన అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్ అడిక్మెట్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో నివాసముంటున్న పేదప్రజలకు శాసనసభ్యులు ముఠా గోపాల్ నిత్యావసర సరకులను అందజేశారు. ప్రజలు సంయమనంతో వ్యవహరించి కరోనాను తరిమివేయడానికి కంకణబద్ధులు కావాలని ఆయన సూచించారు.
ఇవీ చూడండి: మే 8 వరకు పూర్తి స్థాయిలో కోలుకుంటాం : మంత్రి ఈటల