ETV Bharat / state

మే 8 వరకు పూర్తి స్థాయిలో కోలుకుంటాం : మంత్రి ఈటల

author img

By

Published : Apr 28, 2020, 7:24 PM IST

Updated : Apr 28, 2020, 7:49 PM IST

రాష్ట్రంలో కరోనా కేసుల తాజా పరిస్థితిపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. నేడు 6 కొత్త కేసులు నమోదయ్యాయని ఈటల తెలిపారు. మొత్తంగా కేసులు 1009కు చేరుకున్నాయని మంత్రి స్పష్టం చేశారు. మే 8 వరకు పూర్తి స్థాయిలో కోలుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

నేడు కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదు : ఈటల

రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల వెల్లడించారు. మొత్తంగా పాజిటివ్ కేసులు 1009కి పెరిగాయన్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారని వివరించారు. ఇవాళ 42 మంది డిశ్చార్జ్‌ అయ్యారన్నారు. మొత్తం 374 మంది కోలుకుంటున్నారని, వారంతా డిశ్చార్జ్‌ కానున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 610 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 50 శాతానికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయని ఈటల అన్నారు.

తెలంగాణ కృషికి కేంద్రం ప్రశంసలు

రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై కేంద్రం సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేసిందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల వెల్లడించారు. ప్రజల ప్రాణాలు కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వం కృషి అభినందనీయమని విదేశాల్లోని వారు ప్రశంసిస్తున్నారని మంత్రి ఈటల హర్షం వ్యక్తం చేశారు. ఆరు రోజులుగా కేసులు తగ్గుతుండటం శుభ సూచకమని సీఎం కేసీఆర్‌ అన్నారని మంత్రి తెలిపారు. కేసీఆర్‌ వ్యాఖ్యలను జీర్ణించుకోలేని కొంతమంది విమర్శలు చేస్తున్నారని ఈటల అసంతృప్తి వ్యక్తం చేశారు.

'దేశాన్నే అప్రమత్తం చేశాం'

మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిని తొలుత కరీంనగర్‌లో గుర్తించామన్నారు మంత్రి ఈటల. వాళ్లకు పూర్తి స్థాయి పరీక్షలు చేసి దేశాన్ని అప్రమత్తం చేసిన రాష్ట్రం మనదేనని ఆయన గుర్తు చేశారు. కరోనా కట్టడిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మర్కజ్‌ నుంచి 1,281 మంది వచ్చినట్లు తమకు నివేదిక అందిందన్నారు. అతి తక్కువ కాలంలోనే 1,244 మందిని గుర్తించి పరీక్షలు చేశామన్నారు. వీరిలో 240 మందికిపైగా పాజిటివ్ కేసులు వచ్చాయని తెలిపారు. మర్కజ్‌ సంబంధిత కేసులు తప్ప వేరే కేసులేమీ లేవన్నారు. సూర్యాపేటలో 4 రోజులుగా కేసులు రావట్లేదని ఈటల స్పష్టం చేశారు.

మే 8 వరకు పూర్తిగా కోలుకుంటాం

పాజిటివ్ వచ్చిన వ్యక్తులను హోం క్వారంటైన్‌ చేయాలని కేంద్రం చెబుతోంది. కేంద్రం కొత్త నిబంధనల ప్రకారం గాంధీ ఆస్పత్రిలో 10 మంది కంటే ఎక్కువ ఉండరు. అత్యవసరమైన వారికే చికిత్స ఇవ్వాలని ప్రపంచమంతా నిర్ణయించింది. లక్షణాలు లేని వాళ్లను డిశ్చార్జ్ చేశాం. మే 8 వరకు పూర్తి స్థాయిలో కోలుకుంటాం. రాష్ట్రంలో మరణాలు లేకుండా కరోనా అంతం అవుతుందని ఆశిస్తున్నాం. కరోనా మహమ్మారి.. ప్రపంచ మానవాళికే సవాలు విసిరింది. ఇది మతాలకు సంబంధించింది కాదు.. మనుషులకు సంబంధించింది.

- ఈటల రాజేందర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి

ఇవీ చూడండి : దేశంలో 937కు చేరిన కరోనా మరణాలు

Last Updated : Apr 28, 2020, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.