ETV Bharat / state

దోమల నివారణకై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

అంటువ్యాధులు ప్రబలకుండా  ప్రతి ఒక్కరు దోమల నివారణకు పాటు పడాలని ముషీరాబాద్​ శాసన సభ్యులు ముఠా గోపాల్​ కోరారు. నియోజకవర్గంలోని గాంధీ నగర్​, ఆంధ్రా కేఫ్​ చౌరస్తాలో జీహెచ్​ఎంసీ దోమల నివారణకు ఏర్పాటు చేసిన అవగాహన ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.

MLA Muta Gopal  Awareness Rally In Musheerabad
దోమల నివారణకై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్
author img

By

Published : Jun 16, 2020, 7:46 PM IST

వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా, ప్రతి ఒక్కరు దోమల నివారణకు పాటు పడాలని ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్​ సూచించారు. నియోజకవర్గంలోని గాంధీ నగర్​, ఆంధ్రా కేఫ్​ చౌరస్తాలో ఆయన పర్యటించారు. దోమల నివారణ కోసం ప్రజలకు అవగాహన కల్పించడానికి జీహెచ్​ఎంసీ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.

హోటళ్లు, దుకాణాలు, చౌరస్తాల్లో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదన్నారు. కరోనా వ్యాపించకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్​ ముఠా పద్మా నరేష్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.