హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు ఇంజాపూర్ వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన యువకుల కుటుంబాలను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పరామర్శించి... మృతులకు నివాళులర్పించారు. ఇద్దరు యువకులు వాగులో కోట్టుకుపోయి ప్రాణాలు కోల్పోవడం బాధకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపి... ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గం పరిధిలో చెరువులు, కుంటలు, నాలాలు ఎవరైనా ఆక్రమిస్తే... ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: పిల్లల కోసం ఐపీఎల్ వదిలేసిన పీటర్సన్!