ETV Bharat / state

కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి: మాగంటి గోపీనాథ్​ - jubileehills MLA Maganti Gopinath latest news

కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు తప్పక మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని​ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సూచించారు. ​జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్​నగర్ డివిజన్​లో ఏర్పాటు చేసిన మొబైల్ శానిటేషన్ వాహనాన్ని ఆయన ప్రారంభించారు.

మాస్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మాస్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : May 8, 2021, 6:18 PM IST

కరోనా కట్టడికి ప్రజలు ప్రభుత్వ నియమ నిబంధనలను తప్పక పాటించాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ పేర్కొన్నారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం విధిగా పాటించాలన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్​నగర్ డివిజన్​లో కార్పొరేటర్ సి.నారాయణరెడ్డి ఏర్పాటు చేసిన మొబైల్ శానిటేషన్ వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

నియోజకవర్గంలో కరోనాను నియంత్రించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్​లలో వైరస్​ను కట్టడి చేసేందుకు కార్పొరేటర్ల కృషి ఎంతో అభినందనీయమన్నారు. ప్రజలు సైతం ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ.. వైరస్ అంతానికి సహకరించాలని కోరారు. కొవిడ్​ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. అనంతరం పలువురికి మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సి.నారాయణరెడ్డి, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి.. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి: హరీశ్​ రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.