రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఎమ్మెల్యే కాలె యాదయ్య బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కులం, మతం లేకుండా అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ల వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవని చెప్పారు. 30 రోజుల ప్రణాళికలో ప్రతీగ్రామం పరిశుభ్రంగా మారుతుందని.. దానికి గ్రామస్థులు అందరూ సహకరించాలని కోరారు. అంతకు ముందు ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇంగ్లీష్ డిక్షనరీలు అందజేశారు.
ఇదీ చూడండి : ఆత్మహత్య చేసుకోమని మహిళకు తోటి ఉద్యోగుల వేధింపులు