దేశంలో మరెఎక్కడ లేనివిధంగా కరోనాపై సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ముందుస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారని ఆర్మూర్ తెరాస శాసనసభ్యులు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు వైరస్ ప్రభావంపై చర్యలు చెపడుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం కూడా వైరస్ను ఎదుర్కొనేందుకు ఇప్పటికే రూ.500 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. అవసరమైతే మరో రూ. 5000 కోట్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే... కాంగ్రెస్ నాయకులు మాత్రం అనేక ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశానికి పట్టిన అసలు కరోనా కాంగ్రెస్ పార్టీనే అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్