ETV Bharat / state

'భూముల విషయం కాకుండా ప్రజా సమస్యలపై స్పందించాలి' - jagga reddy comments on bandi sanjay

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు తెలియని రీతిలో క్రూడాయిల్, గ్యాస్​ ధరలు పెంచుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై రాష్ట్ర భాజపా అధ్యక్షులు బండి సంజయ్​ స్పందించాలని కోరారు. ఆలయ భూములే కాకుండా ప్రజల సమస్యలను కూడా పట్టించుకోవాలని అన్నారు.

mla jagga reddy comments on bandi sanjay Respond to issues rather than land issues
'భూముల విషయం కాకుండా ప్రజా సమస్యలపై స్పందించాలి'
author img

By

Published : Dec 19, 2020, 3:53 PM IST

భాజపా ప్రభుత్వం ప్రజలకు తెలియని రీతిలో పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ సిలిండర్ ధరలు పెంచుతూ పోతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. యూపీఏ ప్రభుత్వంలో క్రూడాయిల్, సిలిండర్​లపై పది పైసలు పెంచితే... భాజపా ఇప్పుడు వందల రూపాయలు పెంచుతూ పోతోందని ఆయన మండిపడ్డారు.

ఈ విషయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. క్రూడాయిల్ ధరలపై బండి సంజయ్‌ ఎందుకు మాట్లాడడం లేదన్న జగ్గారెడ్డి.. కాళీ మాతా భూముల గొడవ ముఖ్యమా.. ధరల పెరుగుదలతో ప్రజల ఇబ్బందులు ముఖ్యమా అని ప్రశ్నించారు.

ఇదీ చూడండి : గోల్డెన్​ హవర్​లో అత్యవసర వైద్యానికి చర్యలు: సీఎస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.