హైదరాబాద్ చందానగర్‌లోని సంకల్ప ఫౌండేషన్.. ఓ అనాథ యువతి మౌనిక పెళ్లిని ఘనంగా నిర్వహించింది. అన్ని తానై పెంచిన ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రోజీ.. ఈ వివాహాన్ని వైభోగంగా జరిపించి.. యువతికి తల్లిదండ్రులు లేని లోటు తీర్చింది. స్థానిక ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ.. పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వాదించారు. తమ వంతుగా రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
తమ సంస్థ ఆధ్వర్యంలో మరో యువతికి పెళ్లి జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు రోజీ. మౌనిక నేటి నుంచి అనాథ కాదంటూ.. తనకందరూ అండగా ఉన్నారని భరోసా ఇచ్చారు. ఇందులో పలువురి సహకారం ఉందని.. అందరి ఆశీర్వాదాలు నూతన జంటపై ఉండాలని కోరారు.
వధువు మౌనిక.. ఫౌండేషన్ సభ్యులు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపింది. వారికి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొంది.
ఇదీ చదవండి: గ్రామస్థులే అమ్మానాన్నై... వివాహం జరిపించారు..