లాక్డౌన్ కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని... వాళ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని.. ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఏసీబీ కార్యాలయం వద్దనున్న చర్చిలో పాస్టర్లకు ఆయన బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
లాక్డౌన్ వల్ల రెండు నెలల నుంచి చర్చిలు మూసివేసినందున పాస్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. బీఎస్ డేవిడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 400 మంది పాస్టర్లకు నిత్యావసరాలను అందజేశారు. కేసీఆర్తో చర్చించి పాస్టర్లకు స్టైపండ్ ఇచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: 'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'