కరోనా వైరస్ నియంత్రణ కోసం భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నా.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంటి వద్ద ఆ నిబంధనలు బేఖాతరవుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో డివిజన్లోని నిరుపేదలకు ఎమ్మెల్యే.. కొన్ని రోజులుగా నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న నిరుపేదలు, వలస కూలీలు దానం ఇంటి వద్ద పెద్దసంఖ్యలో వరుస కట్టారు. వచ్చిన వారితో భౌతికదూరం పాటించకుండానే.. ఎమ్మెల్యే దానం.. బియ్యం, పప్పులను పంపిణీ చేస్తున్నారు.
అక్కడే ఉన్న పోలీసులు, దానం వ్యక్తిగత సిబ్బంది ప్రజలకు విజ్ఞప్తి చేసినా వినిపించుకోవడం లేదు. ఈ విషయంపై ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను ఈటీవీ భారత్ వివరణ కోరగా... ప్రజలకు పదేపదే చెబుతున్నా వినడం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తోందని వివరించారు.
ఇదీ చూడండి: 'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం'