ETV Bharat / state

Chennamaneni case: పత్రాలన్నీ పుస్తకరూపంలో సమర్పించండి: హైకోర్టు - చెన్నమనేని పౌరసత్వంపై విచారణ

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వం వివాదంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. భారత్ పౌరసత్వంతో జర్మనీ వెళ్లొచ్చారని చెన్నమనేని తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ కేసులో చాలా పత్రాలు ఉన్నందున వాటిని పుస్తక రూపంలో అందించాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది.

Chennamaneni case
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వం వివాదం
author img

By

Published : Jul 27, 2021, 10:32 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్​ పౌరసత్వం వివాదంపై హైకోర్టులో విచారణ ఆగస్టు 10కి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి వద్ద ఇవాళ మరోసారి విచారణకు వచ్చింది. పౌరసత్వ చట్టాలను ఉల్లంఘించలేదని చెన్నమనేని రమేశ్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. భారత పౌరసత్వంతోనే జర్మనీ వెళ్లివచ్చినట్లు ఆయన తెలిపారు.

అయితే గత పన్నెండు నెలలుగా దేశంలో ఉండటం లేదు కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. చెన్నమనేనికి జర్మనీ పౌరసత్వమే ఉందని.. ఇప్పటికీ ఆయన అక్కడే ఉంటున్నారని పిటిషన్​ వేసిన ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది రవికిరణ్ పేర్కొన్నారు. ఈ కేసులో చాలా పత్రాలు ఉన్నందున.. పూర్తి స్థాయి వాదనలు వినేందుకు వీలుగా వాటన్నింటినీ ఒక పుస్తకం రూపంలో చేసి సమర్పించాలని ఇరువైపుల న్యాయవాదులను హైకోర్టు ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది.

వివాదం అక్కడ మొదలైంది..

2013లోనే జర్మనీ పాస్‌పోర్టు గడువు ముగిసిందని చెబుతున్నప్పటికీ రమేశ్‌ అదే పాసుపోర్టుతో 2019లో ప్రయాణించారని... చెన్నమనేని పౌరసత్వంపై ఫిర్యాదు చేసిన ఆది శ్రీనివాసరావు తరఫు న్యాయవాది రవికిరణ్‌రావు గతంలో వాదించారు. చెన్నై విమానాశ్రయం నుంచి జర్మనీ పాస్‌పోర్టుపై ప్రయాణించిన విషయం వాస్తవమేనని కేంద్రం తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌ చెప్పారు. దీంతో కేంద్ర హోంశాఖ... చెన్నమనేని భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది. కేంద్రం తన పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ చెన్నమనేని హైకోర్టును ఆశ్రయించారు.

ఇదీ చూడండి:

Chennamaneni Issue: పౌరసత్వ వివాదంపై విచారణ ఈ నెల 15కి వాయిదా

Chennamaneni issue: చెన్నమనేని పౌరసత్వంపై.. తుది వాదనలకు సిద్ధం కావాలన్న హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.