జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తెరాసకే మరోసారి పట్టం కడతారని ఎమ్మెల్యే బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు. భాజపా నేతలు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని... వారికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని అన్నారు.
హైదరాబాద్ అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కృషి చేసిందని ఆయన వివరించారు. అభివృద్ధిని కొనసాగించేందుకు తమ పార్టీని గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి: తెరాసలో కొత్తవారికి అవకాశం.. 26డివిజన్లలో టికెట్లు