ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కార్యకర్తల ఉత్సాహం నింపేందుకు తానే స్వయంగా బుల్లెట్ నడిపి అందరిని ఉత్సాహపరిచారు. నియోజకవర్గంలో పర్యటించడానికి వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనాల ర్యాలీలో.. తానే బైకు నడిపి ర్యాలీని ప్రారంభించారు.
హిందూపురం మండలం కిరికెర నుంచి పట్టణంలోని సుగురు ఆంజనేయస్వామి ఆలయం వరకు బుల్లెట్ నడిపాడు. దారి పొడవునా అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దీంతో కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది.
ఇదీ చూడండి: కిడ్నాప్ కేసుతో నాకు సంబంధం లేదు: ఏవీ సుబ్బారెడ్డి