చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలు, కంటైన్మెంట్ జోన్లలో ఉన్న వారికి స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నిత్యావసర సరుకులు అందజేశారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని కంటైన్మెంట్ జోన్లనూ పరిశీలించిన అక్బరుద్దీన్.. అధికారులను అడిగి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్, ఉప్పుగూడ కార్పొరేటర్ ఫాహత్ బిన్ సమద్ ఆబ్దాద్, పలువురు వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఆసియాపై కరోనా పట్టు- స్పెయిన్లో తగ్గుముఖం