ప్రపంచవ్యాప్తంగా కరోనాను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నా.. ఆ మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. కరోనా ధాటికి అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు 1.61 లక్షల మంది మృతి చెందారు. వీరిలో రెండో వంతు మరణాలు ఐరోపా దేశాల్లోనే నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 23,47,249కు చేరగా.. ఇందులో సగం కేసులు (11,51,820) ఐరోపాలోనే నమోదయ్యాయి. దేశాలవారీగా చూస్తే అమెరికాలో కేసులు, మరణాల సంఖ్య అధికంగా ఉంది. అమెరికాలో 7,38,923 కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య 39,015కు పెరిగింది.
స్పెయిన్‌లో తగ్గుముఖం..
స్పెయిన్‌లో మృతుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఆ దేశంలో ఇవాళ 410 మంది మరణించారు. మొత్తంగా స్పెయిన్‌లో 20,453మంది కరోనాకు బలయ్యారు. ఇటలీలో 23,227 మంది, , ఫ్రాన్స్‌లో 19,323 మంది, బ్రిటన్‌లో 15,464 మంది చనిపోయారు.
దక్షిణ కొరియాలోనూ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రెండు నెలల తర్వాత కొత్త కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. దక్షిణ కొరియాలో మొత్తం 10,661 కేసులు నమోదుకాగా... 234 మంది మరణించారు.
సింగపూర్‌లో విజృంభణ..
సింగపూర్‌లో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. ఆదివారం ఒక్కరోజే 596 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసులు 6,588కు చేరుకున్నాయి. పాకిస్థాన్‌లోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా 514 మందికి వైరస్ సోకగా.. బాధితుల సంఖ్య 7,993కు పెరిగింది. 159 మంది మరణించారు.
రష్యాలో ఒక్కరోజే 6 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 42 వేలకు చేరింది.
నేపాల్‌లో..
నేపాల్లోనూ నెమ్మదిగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 31 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. శుక్రవారం ఒక్కరోజే 14 కేసులు నమోదయ్యాయి. వీరిలో 12 మంది భారతీయులని అక్కడి అధికారులు తెలిపారు.
వీరంతా ఉదయ్‌పుర్ జిల్లాలోని మసీదులో ఉన్నట్లు గుర్తించారు. మసీదుల్లో ఆశ్రయం కోసం బహదుర్మయిలో జమాత్ సభ్యుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో 14 మసీదులను ప్రభుత్వం మూసేసి 33 మంది భారతీయులు, ఏడుగురు పాక్ పౌరులను క్వారంటైన్‌కు తరలించారు.
ఇదీ చూడండి: ఆ దేశాల్లో 90శాతం విమానాలు నేలపైనే..