ETV Bharat / state

mosquito prevention: దోమలకు పొగేసి.. లక్షలు పోగేస్తున్నారు - telangana latest news

mosquito prevention:సమస్య ఏదైనా అధికారులు మాత్రం ప్రజా ధనాన్ని దోచుకోవడానికే పెద్ద పీట వేస్తారనే విమర్శలున్నాయి. దోమలు ప్రజల రక్తం పీల్చుతుంటే.. వాటి నివారణ పేరిట కొంతమంది అధికారులు ప్రజాధనాన్ని దోచేస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో ఇలాంటి వ్యవహారాలు గత కొన్నేళ్లుగా జరుగుతున్నాయి. అధికారులు డీజిల్ కూపన్లను విక్రయించి బంక్​ల నుంచి డబ్బును ఆర్జిస్తున్నారు. దీనిపై నిఘా పెట్టిన కమిషనర్ వేసవిలో ఫాగింగ్ సగానికి తగ్గించారు.

mosquito prevention in ghmc
దోమలకు పొగేసి.. లక్షలు పోగేస్తున్నారు
author img

By

Published : May 3, 2023, 12:20 PM IST

mosquito prevention: జీహెచ్‌ఎంసీలో దోమల నివారణ కోసం ఫాగింగ్ విషయంలో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. పాతబస్తీ, ఎల్బీనగర్‌ దోమల నివారణ కార్యాలయ సిబ్బంది డీజిల్ కూపన్లను అమ్ముతూ పట్టుబడిన సంఘటన ఈ సంవత్సరం ప్రారంభంలో వెలుగులోకి వచ్చింది. కేంద్ర కార్యాలయం ఇంటర్నర్ ఇన్వెస్టిగేషన్​లో ఎల్బీనగర్‌, చార్మినార్ జోన్లలో దోమల నివారణ అధికారులు రోజుకు 5లక్షల రూపాయలు, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌ జోన్లలో 3లక్షల విలువైన డీజిల్​ను దారి విక్రయిస్తున్నారని తెలిసింది.

mosquito prevention in Hyderabad : జీహెచ్‌ఎంసీలో 6జోన్లు, 30సర్కిళ్లు ఉన్నాయి. దోమల పొగ కొట్టే(ఫాగింగ్‌ )యంత్రాల్లో టాటా ఏస్‌ వాహనంలో తిరిగే పెద్ద యంత్రం (వీఎంఎఫ్‌), చిన్న యంత్రం అనే 2రకాలు ఉన్నాయి. పెద్ద యంత్రాలు 63, చిన్న యంత్రాలు 302 ఉన్నాయి. 4సంవత్సరాలుగా పెద్ద వాటిని ప్రతి జోన్​కు 10చొప్పున, చిన్న యంత్రాలను ఒక డివిజన్​కు 2చొప్పున తిప్పుతున్నారు. ఫాగింగ్ యంత్రాల సామర్థ్యాన్ని బట్టి 90 లీటర్ల డీజిల్ పట్టే యంత్రానికి 14లీటర్లు పెట్రోలు, 4లీటర్ల మలాథియన్ టెక్నికల్ మందును కలుపుతారు. వీటన్నింటి మిశ్రమాన్ని యంత్రంలో వేయడం వల్ల దోమల పొగ ఉత్పత్తి అవుతుంది. ఆ పొగను స్ప్రే చేస్తే దోమలు నీరసించి పడిపోతాయి. దీని వల్ల చాలా వరకు దోమలు నశిస్తాయి. దోమల వల్ల ప్రజలకు ఉపశమనం జరుగుతుంది.

అధికారుల చేతివాటం: ఇలా ఫాగ్ స్ప్రే చేసే సమయంలోనే కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. శేరిలింగంపల్లి జోన్​లో ఒక యంత్రం 90 లీటర్లు డీజిల్​తో నడుస్తుండగా, మిగిలిన యంత్రాలన్నీ 45లీటర్లు, 25 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటాయి. మిగిలిన అన్ని జోన్లలో మాత్రం అన్ని యంత్రాలు 60లీటర్ల నుంచి 90లీటర్ల సామర్థ్యం కలవి. అయితే ఒక్కో ఫాగింగ్ యంత్రం ఎంత దూరం ఫాగింగ్ చేసిందనే లెక్కలు చూశారు. అయితే దానిలో శేరిలింగంపల్లి జోన్​లోనే లెక్క సరిపోతున్నట్లు.. మిగిలిన జోన్లలో డీజిల్​ను ఎక్కువగా ఉపయోగిస్తూ.. తక్కువ ఫాగింగ్ చేస్తున్నట్లు సెంట్రల్ ఆఫీస్ చేసిన అంతర్గత విచారణలో తేలింది.

డబ్బులు తీసుకుంటూ: యంత్రాలకు ఎంటమాలజీ డిపార్ట్​మెంట్ కోరినట్లు.. ప్రతిరోజు డీజిల్ కూపన్లు జోనల్ ఆఫీస్ ఇస్తుంది. ఆ కూపన్లను చూపిస్తే పెట్రోల్ బంకులు డీజిల్ ఇస్తాయి. అయితే కొంతమంది అధికారులు మొత్తం డీజిల్ తీసుకోకుండా రోజూ 500 లీటర్ల డీజిల్​ను పెట్రోల్ బంక్​లోనే వదిలేసి.. ఆ డీజిల్ డబ్బులను తీసుకోవడం చేస్తున్నారు. ఇలా చేయడం అధికారుల నిత్యకృత్యమైంది. ఇలాంటి చర్యలు చార్మినార్ జోన్లో జోరుగా సాగుతోందని.. ఖైరతాబాద్, ఎల్బీనగర్ జోన్లలో కాస్త తక్కువగా జరుగుతోంది. కూకట్​పల్లి, సికింద్రాబాద్ జోన్లలో డీజిల్ విక్రయం అనేది సాధారణ స్థాయిలో జరుగుతోందనే విమర్శలొస్తున్నాయి.

ప్రజాధన దుర్వినియోగం: డీజిల్ కూపన్లు నల్లబజారులో అమ్మడం, డ్రోన్లతో చెరువుల్లో మందు పిచికారీ చేయడం, గుర్రపుడెక్కను తొలగించే పనుల్లో పలు జోనల్ అధికారుల రోజువారి సంపాదన రూ.3లక్షల నుంచి 5లక్షల రూపాయలున్నట్లు ఆరోపణలున్నాయి. సంవత్సరానికి 10 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందనే విమర్శలొస్తున్నాయి.

నిఘా పెట్టిన కమిషనర్‌.. సగానికి కోత: ఫాగింగ్ విషయంలో ఒక్కొక జోన్లో ఒక్కో విధంగా డీజిల్ వినియోగం ఉండటం వల్ల ఈ మధ్యకాలంలో కమిషనర్ లోకేశ్​కుమార్ దీనిపై దృష్టిపెట్టారు. జీహెచ్‌ఎంసీలోని అన్ని జోన్లలో పెద్ద ఫాగింగ్ యంత్రాలకు 45 లీటర్ల డీజిల్‌, 5 లీటర్ల పెట్రోలు, 2.5 లీటర్ల మలాథియన్‌ టెక్నికల్‌ను ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. ఎండాకాలంలో ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి ఫాగింగ్ వల్ల ప్రయోజనం తక్కువుంటుందని.. అందుకే మే నెలలో దోమల ఫాగింగ్​ను సగానికి తగ్గించాలన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.