నీటి పారుదల శాఖ నిర్లక్షం ఆ కాలనీ వాసుల గూడును ముంచింది. నీళ్ల ట్యాంకుకు నీటిని నింపుతున్న అధికారులు ట్యాంకు నిండిన తర్వాత మోటార్ ఆపకపోవడం వల్ల నీరు బయటకొచ్చి ఇళ్లను ముంచెత్తిన ఘటన హైదరాబాద్ శివారు జల్పల్లి మున్సిపాలిటీ పరిధి శ్రీరామ్‌నగర్ కాలనీలో జరిగింది.
కాలనీలో మిషన్ భగీరథ పథకం కింద నూతనంగా నిర్మించిన నీళ్ల ట్యాంకును ఇవాళ పరీక్షించారు. ఈ క్రమంలో నీటిని విడిచిపెట్టిన అధికారులు ట్యాంకు నిండినా మోటార్ ఆపడం మరిచిపోయారు. ట్యాంకు నిండి నీరంతా కాలనీలో ఇళ్లలోకి చేరింది. ట్యాంకు నిర్మించారని సంతోషపడాలో... అధికారుల నిర్లక్ష్యానికి బాధపడాలో తెలియని పరిస్థితి కాలనీవాసులది. ట్యాంకు నిర్మాణంలోనూ నాణ్యత లోపించిందని స్థానికులు అంటున్నారు.