మారేడ్‌పల్లిలోని మంచి కలలు అనే స్వచ్ఛంద సంస్థలో ఆశ్రయం పొందుతున్న అనిల్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. కనిపించకుండా పోయిన ఈ బాలుడు ఆర్ఎం స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. గతేడాది వేసవి కాలంలోనూ తరగతుల దృష్ట్యా అనిల్ వెళ్లిపోగా అతన్ని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తిరుపతి ట్రైన్ ఎక్కుతుండగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రైల్వేస్టేషన్, బస్టాండ్, ట్యాంక్బండ్ తదితర పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ అనిల్జాడ తెలియలేదని సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. వెంటనే మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్టు చెప్పారు.
ఇదీ చూడండి: తెలంగాణ విమోచన దినోత్సవం వెనకున్న చరిత్ర ఇదే!!