ETV Bharat / state

ఆకట్టుకుంటున్న 'మింట్​ మ్యూజియం'.. అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు.. - Hyderabad latest news

Mint Museum in Hyderabad: హైదరాబాద్​లోని సైఫాబాద్‌లో ఏర్పాటు చేసిన మింట్ మ్యూజియం నగరవాసులను ఆకట్టుకుంటుంది. ప్రపంచం క్రిప్టో కరెన్సీ వైపు పరుగులు పెడుతున్న వేళ భావితరాలకు అప్పటి నాణేల ముద్రణపై అవగాహన కల్పించేందుకు మ్యూజియం ఏర్పాటు చేశారు. దేశంలో అత్యుత్తమ మ్యూజియంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

Mint Museum established in Hyderabad
Mint Museum established in Hyderabad
author img

By

Published : Sep 25, 2022, 7:48 AM IST

నగర వాసులను ఎంతో ఆకట్టుకుంటున్న "మింట్​ మ్యూజియం"

Mint Museum in Hyderabad: అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్ సైఫాబాద్‌లో మ్యూజియం ఏర్పాటు చేయాలని కేంద్రం ఆధీనంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంకల్పించింది. ఇందులో భాగంగా 1901 నాటి శిథిలావస్థకు చేరిన భవనాన్ని పునరుద్ధరించడంతో పాటు సర్వాంగ సుదరంగా తీర్చిదిద్దింది. జూన్ 7న ప్రారంభించిన ఈ మ్యూజియాన్ని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు.

భాగ్యనగరంలో కరెన్సీ ముద్రణకు వాడిన లండన్ మిషన్​ ప్రదర్శన: మింట్ పరిసర ప్రాంతాలతో పాటు మ్యూజియంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల నాణేలను తిలకించారు. దేశచరిత్ర, గతంలో ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేసిందనే విషయంపై యువతరానికి అవగాహన కల్పించేందుకే మ్యూజియం ఏర్పాటు చేసినట్లు కిషన్‌రెడ్డికి అధికారులు వివరించారు. వందేళ్ల కిందట భాగ్యనగరంలో కరెన్సీ ముద్రణకు వాడిన లండన్ నుంచి తెచ్చిన యంత్రాలను ప్రదర్శనలో ఉంచినట్లు తెలిపారు.

షేర్​షా సూరి కాలం నాటి నాణెం ప్రదర్శన: మింట్‌ మ్యూజియాన్ని దేశంలోనే అత్యుత్తమ మ్యూజియంగా తీర్చిదిద్దుతామని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. మింట్ మ్యూజియంలో 1613లో జహంగీర్ కాలంలో రూపొందించిన 11 కిలోల బంగారు నాణేనికి సంబంధించిన నమూనాను ప్రదర్శిస్తున్నారు. షేర్ షా సూరి కాలం నాటి తొలి నాణెం మొదలుకుని ప్రస్తుతం చలామణిలో ఉన్న అన్నింటిని ప్రదర్శిస్తున్నారు. మ్యూజియంలోకి ప్రవేశించగానే ఇందుకు సంబంధించి సుమారు వందేళ్ల చరిత్రకు సంబంధించిన వీడియో ప్రదర్శన ఉంది.

మ్యూజియంలో వందేళ్ల కాలంలో ప్రత్యేక సందర్భాల్లో విడుదల చేసిన నాణేలను, పతకాలను విక్రయిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందని.. ఆదివారం సెలవు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.