ETV Bharat / state

ఐదో విడత హరితహారంపై మంత్రి ఇంద్రకరణ్​ సమీక్ష

ఐదో విడత హరితహారంలో భాగంగా అధికారులు 83 కోట్ల మొక్కలు నాటి... వాటిని సంరక్షించాలని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్​ సూచించారు. హైదరాబాద్​ అరణ్య భవన్​లో హరితహారంపై సమీక్ష నిర్వహించారు. అటవీ సిబ్బంది ఇతర విభాగాలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. కలెక్టర్​ నుంచి అందరు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు.

మంత్రి ఇంద్రకరణ్​ సమీక్ష
author img

By

Published : Jun 26, 2019, 8:34 PM IST

హరితహారంపై మంత్రి ఇంద్రకరణ్​ సమీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా 83.30 కోట్ల మొక్కలు నాటి... వాటి సంరక్షణపై దృష్టి పెట్టాలని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్​ అరణ్య భవన్​లో త్వరలో మొదలు కానున్న ఐదో విడత హరిత హారంపై మంత్రి సమీక్షించారు. అధికారులు ప్రతి గ్రామాన్ని పర్యటించి ఆ గ్రామంలో ఏ మేరకు మొక్కలు నాటవచ్చో... గ్రామ సర్పంచ్​, వార్డు మెంబర్లకు తెలియజేయాలన్నారు. అటవీ శాఖ సిబ్బంది ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. హరితహారం కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని అన్నారు. అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటడం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని నిర్దేశించారు.
పరిశ్రమల యాజమానులు కూడా సామాజిక బాధ్యతగా హరితహారం కార్యక్రమంలో భాగస్వాములై మొక్కలు నాటే బాధ్యత తీసుకోవాలని మంత్రి సూచించారు. కలెక్టర్​ స్థాయి నుంచి అందరు అధికారులు, సిబ్బంది, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరుకావాలని అన్నారు. తాను స్వయంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి : నిజాయితీ చాటిన హైదరాబాద్​ ఆటో డ్రైవర్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.