Minority 1 Lakh Distribution Today Telangana : రాష్ట్రంలో మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం(Telangana minorities Rs1 lakh scheme) పంపిణీ.. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఉదయం 11.30 గంటలకు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు అధికారికంగా ప్రారంభించనున్నారు. అదే సమయంలో తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలలో కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. మైనారిటీ యువత స్వయం ఉపాధి కోసం వంద శాతం రాయితీతో లక్ష రూపాయలను ఆర్థిక సాయం(1 lakh For minorities scheme 2023)గా దానిని ప్రభుత్వం అందించనుంది. తొలి విడతలో భాగంగా దాదాపు పది వేల మందికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సాయం అందించనున్నారు.
1 Lakh Cheques Distribution for Minorities Telangana Today : మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయానికి అఫ్లై చేయాలనుకుంటే.. కావాల్సిన ధ్రువపత్రాలు, విధివిధానాలు, అర్హతలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈ దరఖాస్తును ఆన్లైన్లో చేయడానికి వీలుంటుంది. htpps://tsobmmsbc.cgg.gov.in అనే సైట్లోకి వెళ్లి దరఖాస్తు దారులు ఆన్లైన్ అఫ్లికేషన్ నింపాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ పథకానికి సంబంధించిన ఆర్థికసాయాన్ని సబ్సిడీ వన్‌టైం గ్రాంటుగా అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
అర్హతలు :
⦁ ఈ పథకానికి జూన్2, 2023 నాటికి 21 నుంచి 55 సంవత్సరాల మద్య వయస్సు కలిగి ఉండాలి.
⦁ లబ్ధిదారుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు.
⦁ ఇంతకు ముందు ఏదైనా సంక్షేమ పథకాలను వినియోగించుకున్న లబ్ధిదారులు అనర్హులు.
దరఖాస్తు సమయంలో కావాల్సిన పత్రాలు :
⦁ ఆధార్ కార్డు
⦁ రేషన్ కార్డు
⦁ పాన్ కార్డు
⦁ కుల ధ్రువీకరణ పత్రం
⦁ ఆదాయ ధ్రువీకరణ పత్రం
⦁ బ్యాంక్ అకౌంట్ నంబరు
⦁ రెండు ఫొటోలు
⦁ బీసీ-సీ లేదా బాప్టిజం సర్టిఫికేట్(క్రిస్టియన్ మైనార్టీలకు)
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది:
- ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
- మొదటి విడతలో 10వేల మందిని ఎంపిక చేయనున్నారు.
- జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తుంది.
- లబ్ధిదారుల జాబితా జిల్లా కలెక్టర్లు, ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదం పొందాల్సి ఉంటుంది.
- విడతల వారిగా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేత.
- Gruha Lakshmi scheme Telangana : ఆగస్టు నుంచి పట్టాలెక్కనున్న 'గృహలక్ష్మి పథకం'
Financial Assistance Scheme For Minorities Of Rs1 Lakh : సమాజంతో ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు, సామాజిక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. అందుకు అన్ని కులాలు, మతాల వారికి లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది. దళిత బంధు, గిరిజన బంధు, బీసీ చేతి వృత్తుల వారికి లక్ష ఆర్థిక సాయం వంటి పథకాలను ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు మైనార్టీలకు కూడా లక్ష ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. అందుకు మొదట ఆగస్టు 16 నుంచే ఆర్థిక సాయం పంపిణీ చేయనున్నట్లు తెలుపగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగస్టు 19(నేటి నుంచి) ఇవ్వనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
1 Lakh for Minorities Scheme In Telangana : మొదటి విడతగా 10వేల మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయనున్నారు. అందుకు ఎల్బీ స్టేడియంలో అందుకు తగిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ పథకానికి మొదట్లో రూ.270 కోట్లను కేటాయించారు.. ఈ మొత్తానికి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.130 కోట్లను కేటాయించారు. దీంతో రూ.400 కోట్లతో మైనార్టీలకు ఆర్థిక సాయం చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో జనాభా దామాషా ప్రకారం ఆర్థిక సాయం లబ్ధిదారును ఎంపిక చేశారు.