రాష్ట్రంలో కరోనా వైరస్ లేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో స్పష్టం చేశారు. కరోనా దుష్ప్రచారంతో పౌల్ట్రీ రంగం రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టపోయిందని తెలిపారు. 45 రోజుల్లో తాను కూడా రూ.10 కోట్లు నష్టపోయానని పేర్కొన్నారు.
'ఎగ్ బాస్కెట్ ఇన్ ఇండియా ఈజ్ తెలంగాణ' అని ఈటల స్పష్టం చేశారు. చికెన్‌ను కూడా రాష్ట్రం ఎక్కువగా ఉత్పత్తి చేస్తోందన్నారు. జీఎస్డీపీకి పౌల్ట్రీ రంగం సంవత్సరానికి 12 వందల కోట్లు సమకూరుస్తుందని స్పష్టం చేశారు.