మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి విపక్షాలకు అభ్యర్థులు దొరకడంలేదని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. జాతీయ పార్టీలు కాంగ్రెస్, భాజపాల పరిస్థితి అధ్వానంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్, జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు సమావేశమయ్యారు.
సెంటిమెంట్ పేరుతో కొంతమంది ఎంపీ ఎన్నికల్లో భాజపాకు ఓట్లు వేసినా ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మున్సిపల్, ఐటీ మంత్రిగా కేటీఆర్ అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో భాజపా దయనీయమైన పరిస్థితి ఎదుర్కొంటుందని కొప్పుల అన్నారు. ప్రజలు మరోసారి తమ వెంట ఉండడం ఖాయమని తెలిపారు.
ఇవీ చూడండి: వింటే నామినేటెడ్ పదవులు.. లేకుంటే వేటే!