ETV Bharat / state

వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట: తలసాని - హైదరాబాద్ లేటెస్ట్ అప్డేట్స్

అత్యవసర చికిత్స కోసం ఐసీయూతో కూడిన అంబులెన్స్​ని మహావీర్ ఆస్పత్రికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి అందజేశారు. తక్కువ ఫీజులతో ఆ ఆస్పత్రి అందిస్తున్న వైద్య సేవలను కొనియాడారు. మహావీర్ రీసెర్చ్ సెంటర్​ను ప్రారంభించారు.

ministers talasani srinivas yadav and malla reddy inaugurated ambulance in hyderabad
వైద్య రంగానికి పెద్ద పీట: తలసాని
author img

By

Published : Dec 12, 2020, 1:54 PM IST

వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిరుపేద వర్గాల కోసం ప్రభుత్వ ఆస్పత్రులు మెరుగు పరచడంతో పాటు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సికింద్రాబాద్ రోటరీ క్లబ్, బీహెచ్ఈఎల్ సంయుక్త ఆధ్వర్యంలో ఇచ్చిన రూ.22లక్షల విలువ చేసే అంబులెన్స్​ని మాసాబ్ ట్యాంక్​లోని మహావీర్ ఆస్పత్రి నిర్వాహకులకు మంత్రి మల్లారెడ్డితో కలిసి అందజేశారు. మహావీర్ రీసెర్చ్ సెంటర్​ను ప్రారంభించారు.

అధిక డబ్బులు వసూలు చేస్తున్న కార్పొరేట్ అస్పత్రులకు వెళ్లాలంటే భయపడుతున్న పేదలకు... తక్కువ ఫీజులతో చికిత్స అందిస్తున్న మహావీర్ ఆస్పత్రి నిర్వాహకులను మంత్రులు అభినందించారు. సేవా కార్యక్రమాల్లో ముందుడే రోటరీ క్లబ్... అత్యవసర చికిత్స కోసం ఐసీయూతో కూడిన అంబులెన్స్​ను అందజేసిందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కడతేర్చాడు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.