సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇక్కడి పేద ప్రజలకు అండగా నిలబడతారని ఇళ్లులేని వారికి డబుల్బెడ్రూం ఇళ్లు కేటాయిస్తారని చెప్పారు.
ఆర్థికశాఖ మంత్రితో మాట్లాడి కంటోన్మెంట్ బోర్డుకు నెలకు 10 కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
కంటోన్మెంట్లో ఆదాయం పెంచుకునే అవకాశాలపై బోర్డ్ మెంబర్స్, అధికారులు దృష్టి సారించాలని మంత్రులు సూచించారు. కంటోన్మెంట్ భూములు అక్రమిస్తే.. కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంటోన్మెంట్‌కు మంచిరోజులు వచ్చాయని... దీని రూపురేఖలు పూర్తిగా మారుతాయని మంత్రులు వివరించారు.