ETV Bharat / state

దసరా నాటికి మరో 3200 ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తాం: తలసాని - ministers review on double bed room house

హైదరబాద్​ జిల్లాలో డబుల్​ బెడ్​రూమ్ ఇండ్ల నిర్మాణ పనులపై మంత్రులు మహమూద్​ అలీ, తలసాని శ్రీనివాస్​ యాదవ్​ సమీక్ష నిర్వహించారు. ​దసరా నాటికి మరో 3200 ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి తలసాని తెలిపారు.

ministers review on double bed room houses in hyderabad
దసరా నాటికి మరో 3200 ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తాం: తలసాని
author img

By

Published : Aug 21, 2020, 5:06 PM IST

హైద‌రాబాద్ జిల్లాలో దసరా నాటికి మరో 3200 ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాప్ యాద‌వ్ వెల్ల‌డించారు. దసరా కానుకగా న‌గ‌రంలోని 21 ప్రాంతాల్లో 4,358 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేప‌డుతామ‌ని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ మాస‌బ్ ట్యాంకులోని ప‌శుసంవ‌ర్థ‌క శాఖ కార్యాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హించారు. స‌మావేశంలో కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.

న‌గ‌రంలో 1144 ఇళ్లు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయని మంత్రి అన్నారు. హైదరాబాద్ జిల్లాలో 812 కోట్ల రూపాయల ఖర్చుతో 7,455 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేస్తున్నట్లు మంత్రి వివ‌రించారు.

ఇవీ చూడండి: కరోనా ఐసోలేషన్​ సెంటర్​ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.