ETV Bharat / state

ఈనెల 28 నాటికే మేడారం జాతర పనులు పూర్తి - Medaram Jatara

Ministers Review Medaram Festival : ఈనెల 28తో మేడారం జాతర పనులు పూర్తి అవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. గతంలో ఎవరైతే జాతర జరిగినప్పుడు అధికారులుగా విధులు నిర్వహించారో వారినే మళ్లీ నియమిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్​లో ఇవాళ మేడారం జాతర ఏర్పాట్లు, భద్రతపై సమీక్ష నిర్వహించారు. ఇందులో మంత్రులు పొన్నం ప్రభాకర్​, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, కొండా సురేఖ, సీఎస్​ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, అధికారులు పాల్గొన్నారు.

Medaram Festival
Ministers Review Medaram Festival
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 9, 2024, 10:16 PM IST

Ministers Review Medaram Festival : మేడారం జాతర అన్ని పనులు ఈనెల 28వ తేదీ వరకు పూర్తవుతాయని రవాణా, బీసీ, సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్​ వెల్లడించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్​ ఇతర అధికారులకు వర్క్​ అసైన్​ చేశారని తెలిపారు. మేడారం జాతర(Medaram Jatara)కు గతంలో పనిచేసిన అధికారులకు వర్క్​ ఆసైన్​ చేశారని తెలిపారు. హైదరాబాద్​లోని ఎంసీహెచ్​ఆర్డీలో ఏర్పాటు చేసిన మేడారం సమ్మక్క సారక్క జాతరపై మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రులు పొన్నం ప్రభాకర్​, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, కొండా సురేఖ, సీఎస్​ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ జాతరకు గతంలో పనిచేసిన అధికారులకు ట్రాఫిక్​ జామ్​, రూట్​ క్లియరెన్స్​ కోసం నోడల్​ ఆఫీసర్​కు బాధ్యతలు అప్పగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కొట్లాది మంది భక్తులు తరలివచ్చే జాతరలో ప్రధానంగా ట్రాఫిక్​(Traffic Problems) కష్టాలు లేకుండా చూసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ అధికారులకు ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమ్మక్క సారక్క జాతర విజయవంతానికి అన్ని డిపార్టుమెంట్ల అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని వివరించారు. జాతరకు 1.50 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మహిళలు ఇచ్చే మహాలక్ష్మీ పథకం ఉచిత బస్సు ప్రయాణం ద్వారా భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు.

Medaram Festival 2024 : ఈసారి 6వేల బస్సులు నడిపించడానికి ఆర్టీసీ ప్రణాళికలు రచించిందని మంత్రి తెలిపారు. జాతరకు అదనంగా బస్సులు వేయడం వల్ల 3 రోజుల పాటు హైదరాబాద్​ నగరంతో పాటు పలు జిల్లాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకోసం ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని పొన్నం ప్రభాకర్​ పేర్కొన్నారు.

కొత్త సంవత్సరం మేడారానికి పోటెత్తిన భక్తజనం

Minister Seethakka Review on Medaram Fair : గత డిసెంబరు నెలలో జరిగిన సమీక్షలో ఫిబ్రవరి నెలలో జరిగే మేడారం జాతరను ఘనంగా నిర్వహించాలని పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటికే జాతర ఏర్పాట్లలో భాగంగా పారిశుద్ధ్యం, రహదారులు, విద్యుత్​, తాగునీటి లభ్యత, స్నానాల ఏర్పాట్లు, భక్తుల వసతులు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి మేడారం జాతర గురించి మరోసారి ప్రతిపాదన పంపి జాతీయ పండుగ హోదా కోసం కృషి చేద్దామని సీతక్క తెలిపారు. ఇంకా ఘనంగా మేడారం పండుగను నిర్వహించవచ్చని చెప్పారు.

మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కోసం కృషి : సీతక్క

మేడారం మహాజాతరకు ముంచుకొస్తున్న సమయం - అయినా పట్టాలెక్కని అభివృద్ధి పనులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.