ETV Bharat / state

నిర్మలా సీతారామన్ బడ్జెట్​పై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు.. కేంద్రంపై ఘాటైన విమర్శలు - కేంద్రబడ్జెట్​2023

Union Budget 2023: కేంద్రబడ్జెట్​ 2023పై మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్​రెడ్డి, కొప్పుల ఈశ్వర్​ మండిపడ్డారు. ఈ బడ్జెట్​ వల్ల పేద, మధ్య తరగతి వర్గాల వారికీ పూర్తిగా అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఏ రంగానికి కూడా సరైన నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ministers
ఎర్రబెల్లి నిరంజన్​రెడ్డి
author img

By

Published : Feb 1, 2023, 7:59 PM IST

Ministers Not Satisfied With Budget 2023: 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గానూ​ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని రాష్ట్ర మంత్రులు నిరంజన్​రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్​రావు, కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఈ సందర్భంగా వారు వేర్వేరు సమావేశాల్లో మాట్లాడుతూ కేంద్రంపై ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్​ వల్ల పేద, మధ్య తరగతి వర్గాల వారికి పూర్తిగా అన్యాయం జరిగిందని వాపోయారు.

రైతు వ్యతిరేక ప్రభుత్వం: కేంద్రంలో కొనసాగుతున్న రైతు వ్యతిరేక ప్రభుత్వం.. ఎప్పటి మాదిరే ఈ బడ్జెట్‌లోనూ తెలంగాణకు మొండిచేయి చూపిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆక్షేపించారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది 22 శాతం కేటాయింపులు తక్కువగా ఉన్నాయని ఆరోపించారు. గత బడ్జెట్‌లో రూ.2.25 లక్షల కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్‌లో అది రూ.1.75 లక్షల కోట్లకు కుదించారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెల్లగా రసాయన ఎరువుల రాయితీకి మంగళం పాడుతున్న కేంద్రం.. ఇప్పటికే ఎరువుల ధరలు, డీజిల్, పెట్రోల్ ధరల పెంపు ద్వారా రైతులపై పెట్టుబడి భారం పెంచిందని విమర్శించారు.

2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అని మొన్నటి వరకు గొప్పగా చెప్పుకున్న ప్రధాని నరేంద్రమోదీ సర్కారు ఈ బడ్జెట్‌లో మాత్రం ఆ ఊసే లేదని దుయ్యబట్టారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. కోటి మంది రైతులను మూడేళ్లలో సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లిస్తాం.. 10 వేల జీవ ఉపకరణాల వనరుల కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా మైక్రో ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ మాన్యుఫాక్చరింగ్ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో గొప్పగా ప్రకటించారని గుర్తు చేశారు. కానీ, బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించిన దాఖలాలు లేవని... రైతులను ప్రత్యామ్నాయ ఎరువుల వైపు మళ్లించే పీఎం ప్రణామ్ పథకానికి కూడా బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించలేదని ఆరోపించారు.

ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసే ఆలోచనలో కేంద్రం: బడ్జెట్​లో ఉపాధిహామీ పథకం నిధులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు విమర్శలు గుప్పించారు. గతంలో రూ.80 వేల కోట్ల కేటాయింపులు ఉండేవని తెలిపారు. కానీ ఇప్పుడు రూ.30వేల కోట్లకు తగ్గించారని మంత్రి మండిపడ్డారు. ఈ పథకాన్ని మోదీ సర్కారు పూర్తిగా ఎత్తేసే ఆలోచనలో ఉందని ఆరోపణలు చేశారు. కేంద్రం వైఖరి వల్ల కూలీలు, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఉపాధి హామీకి నిధుల కోతపై కూలీలు, ఫీల్డ్​ అసిస్టెంట్లు స్పందించాలని ఎర్రబెల్లి సూచించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బడ్జెట్​లో ఎంత కేటాయించారు: కేంద్ర బడ్జెట్​ రూ.39లక్షల 45వేల కోట్లలో ఎస్సీ, ఎస్టీలకు కేవలం చెరో రూ.15వేల కోట్లు మాత్రమే కేటాయించారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ ఆరోపించారు. బీసీల సంక్షేమానికి అయితే కేవలం రూ.1400 కోట్లను మాత్రమే ఇచ్చారని విమర్శించారు. నిర్మలా సీతారామన్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొండిచేయి చూపించారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్​ కులాలకు ఏటా రూ.38 వేల కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్రం మాత్రం దేశవ్యాప్తంగా రూ.15వేల కోట్లనే ఖర్చు చేస్తామనడం సిగ్గుచేటన్నారు. రైతులు, కూలీలు, ఉపాధి హామీ కూలీలకు ఈ బడ్జెట్​ వ్యతిరేకంగా ఉందన్నారు. కార్పొరేట్లకు కొమ్ము కాసే విధంగా ఉందని ఎద్దేవా చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.