Ministers foundation stone in Hyderabad: బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమే బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కులవృత్తులకు చేయూతగా ఉచిత విద్యుత్తును అందించడమే కాక అత్మగౌరవ భవనాల కోసం అత్యంత ఖరీదైన కోకాపేట, ఉప్పల్ భగాయత్‌లో వేల కోట్ల విలువైన స్థలాలను కేటాయించిందని మంత్రి చెప్పారు. కోకాపేటలోని ఆరెకటిక, గాండ్ల, రంగ్రేజ్, భట్రాజ్ కులాల ఆత్మగౌరవ భవనాలకు మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ , తలసాని శ్రీనివాస్ యాదవ్ , శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారు. బీసీల విద్య, ఉపాధి కల్పన, సంక్షేమానికి బడ్జెట్ లో సముచిత ప్రాధాన్యం కల్పించారని మంత్రులు తెలిపారు.
మంత్రి గంగుల కమలాకర్ ఏం అన్నారంటే?: ఈ నాలుగు భవనాలతో కలిపి ఇప్పటి వరకూ 29 ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన జరిగినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బీసీల పట్ల ఆపేక్ష గల సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 41 బీసీ కులాలకు రూ.95.25 కోట్లు విలువ చేసే 87.3 ఎకరాలు కేటాయించారని ఆయన తెలిపారు. ఈ ఆత్మగౌరవ భవనాలను సైతం తమ కులం ఖ్యాతి ఇనుమడించేలా కట్టుకోవడానికి ఆయా సంఘాలకే అవకాశం కల్పించారని గుర్తుచేసారు. ఇందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పారు.
మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్లు ఏం మాట్లాడారంటే?: స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసారని.. మన అవసరాల్ని ఏ ప్రభుత్వమూ తీర్చలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వృత్తులుగా విడిపోయినా బీసీ వర్గాల డీఏన్ఏ ఒకటేనన్నారు. కోకాపేట్‌లోని భూమి వేలంలో ఒక ఎకరం 85 కోట్లు పలికిందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పినా.. బీసీ బిడ్డల కంటే ముఖ్యం ఏదీ కాదని అన్నారని.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బీసీలు బాగుండాలని.. వారి అభివృద్ధిలో ఇది ఎంతో కీలకమన్నారు.
"ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్లో బీసీలకు 250 నుంచి 1000 కోట్లు మధ్యలో తప్పా అంతకన్నా ఎక్కువ డబ్బులు కేటాయించడానికి ఎవరికి మనసు రాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల గురించి ఆలోచించి ఈ 11 సంవత్సరాల్లో రూ.48 వేల కోట్ల రూపాయలు కేటాయించారని నేను సగర్వంగా చెబుతున్నాను." - గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
ఇవీ చదవండి: