ETV Bharat / state

మొక్కలు నాటిన మంత్రులు ఇంద్రకరణ్, సబిత - green challenge news

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్​లో భాగంగా మంత్రులు ఇంద్రకరణ్​రెడ్డి, సబితాఇంద్రారెడ్డి మొక్కలు నాటారు. ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు కూడా మొక్కలు నాటారు.

Ministers indra karan redd
మొక్కలు నాటిన మంత్రులు ఇంద్రకరణ్, సబిత
author img

By

Published : Dec 19, 2019, 5:26 PM IST

గ్రీన్ ఛాలెంజ్​లో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఈరోజు మాజీద్ గడ్డ జంగిల్ క్యాంపులో మొక్కలు నాటారు. కార్యక్రమంలో భాగంగా... ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు సైతం గ్రీన్ ఛాలెంజ్​ని పూర్తి చేసి... మరికొందరిని నామినేట్ చేశారు.

ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి ఆర్ శోభ గ్రీన్ ఛాలెంజ్ నిర్వహించారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో జంగిల్ క్యాంపు అర్బన్ ఫారెస్ట్ అడ్వంచర్ క్యాంపు ప్రారంభోత్సవంలో పాల్గొన్న అధికారులు ఆ తర్వాత అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు.

చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి ఇటీవల విసిరిన గ్రీన్ ఛాలెంజ్​ను అంగీకరించిన రాజేశ్వర్ తివారి మూడు మొక్కలు నాటి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును నామినేట్ చేశారు. ఇదే కార్యక్రమంలో అజయ్ మిశ్రా మొక్కలు నాటి రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్ తీగల అనితా రెడ్డి, మహేశ్వరం ఎంపీపీ రఘుమారెడ్డి, హర్షగూడ సర్పంచ్ పాండు నాయక్​ను నామినేట్ చేశారు.

చీఫ్ సెక్రటరీ జోషితో పాటు, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ కే విప్లవ్ కుమార్ విసిరిన రెండు గ్రీన్ ఛాలెంజ్​లను స్వీకరించిన పీసీసీఎఫ్ఆర్ శోభ మొత్తం ఆరు మొక్కలు నాటి మరో ఆరుగురిని నామినేట్ చేశారు. తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ అన్ని వర్గాలను ఆకట్టుకుంటోందని ఈ సందర్భంగా అధికారులు అభిప్రాయపడ్డారు.

పర్యావరణ స్పృహ పెంచటంతో పాటు, అందరూ మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలన్న పట్టుదలను గ్రీన్ ఛాలెంజ్ పెంచుతోందని ప్రశంసించారు.

మొక్కలు నాటిన మంత్రులు ఇంద్రకరణ్, సబిత

ఇవీచూడండి: హైదరాబాద్​లో 'పౌర' సెగ: వామపక్ష నేతల అరెస్ట్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.