పేదింటి ప్రజల సొంతింటి కలను నెరవేర్చిన గొప్ప నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని సిల్వర్ కాంపౌండ్‌లో నూతనంగా నిర్మించిన 164 రెండు పడక గదుల ఇళ్ల(DOUBLE BED ROOM INAUGURATION)ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(MINISTER TALASANI SRINIVAS YADAV), హోం మంత్రి మహమూద్ అలీ(HOME MINISTER MAHAMOOD ALI), కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి(MINISTER MALLAREDDY), కంటోన్మెంట్ ఎమ్మెల్యే(MLA SAYANNA) సాయన్న ప్రారంభించారు. లబ్ధిదారులకు మంత్రుల చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
![DOUBLE BED ROOM INAUGURATION](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13147553_lshfh1.png)
పేద ప్రజల నాయకుడిగా
పేదలకు రెండు పడక గదుల ఇళ్లు కట్టించిన ఘనత సీఎం కేసీఆర్(CM KCR)కే దక్కుతుందని హోం మంత్రి స్పష్టం చేశారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలతో తెలంగాణ దూసుకుపోతోందని పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
![DOUBLE BED ROOM INAUGURATION](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13147553_28_13147553_1632385293860.png)
ఎమ్మెల్యే కృషి ఎనలేనిది
పేదలకోసం కంటోన్మెంట్ ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి తలసాని పేర్కొన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని రసూల్‌పూర మురికివాడగా ఉన్నప్పటికీ పేద ప్రజల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించాలని ఆయన చేసిన కృషి గొప్పదని కొనియాడారు. పేద ప్రజల నాయకుడిగా ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే నేతగా సాయన్న నిలిచారని అన్నారు.
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్
పేద ప్రజలు ఆత్మగౌరవంగా బతకాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తలసాని అన్నారు. గత ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న కేటీఆర్ ప్రతిపాదనను సమర్థిస్తున్నట్లు చెప్పారు. దీంతో జీహెచ్ఎంసీ మాదిరిగా కంటోన్మెంట్ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలోనే తెలంగాణను నెంబర్ 1గా తీర్చిదిద్దడంలో కేసీఆర్ సఫలం అయ్యారని మల్లారెడ్డి అన్నారు. పేద ప్రజల నాయకుడిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు.
ఇదీ చదవండి: Telangana assembly sessions 2021 : శాసనసభ సమావేశాల్లో ఏమేం చర్చిద్దాం? ఏఏ బిల్లులు ప్రవేశ పెడదాం?