ETV Bharat / state

'అభయహస్తం' దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి : భట్టి

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2024, 5:28 PM IST

Updated : Jan 12, 2024, 10:14 PM IST

Ministerial Sub Committee on Public Administration Meeting at Secretariat : రాష్ట్ర సచివాలయంలో ప్రజా పాలనపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ ​బాబులు పాల్గొన్నారు. ఆరు గ్యారెంటీల అమలు, ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులపై సమీక్షలో చర్చించారు.

Ministerial Sub Committee on Public Administration Meeting at Secretariat
Ministerial Sub Committee

Ministerial Sub Committee on Public Administration Meeting at Secretariat : అభయహస్తం పథకాల దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాపాలనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం, ఐదు గ్యారంటీ పథకాల అమలు, విధి విధానాలపై వివిధ శాఖల అధికారులతో చర్చించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి శ్రీధర్​ బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

దరఖాస్తుల్లోని డేటా ఎంట్రీకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అసలైన లబ్ధిదారుల ఎంపిక జరగాలని, దానికి తగినట్లు కార్యాచరణ ఉండాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ ​బాబు తెలిపారు. దరఖాస్తుల్లో బ్యాంకు వివరాలే అడగనందున, ఓటీపీ అనే అంశమే తలెత్తదని మంత్రి స్పష్టం చేశారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి శ్రీధర్ ​బాబు కోరారు.

గ్యారంటీల అమలు జరిగేలా బడ్జెట్ రూపకల్పన కోసమే ప్రజాపాలన దరఖాస్తులు : భట్టి విక్రమార్క

దరఖాస్తుల్లోని వివరాలను ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్న డేటాతో క్రోడీకరించాలని మంత్రి తెలిపారు. దానివల్ల లబ్దిదారుల డూప్లికేషన్ ఉండదన్నారు. దరఖాస్తుల్లో కొన్ని వివరాలు లేనట్లయితే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు వాటిని సేకరించాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు రామకృష్ణరావు, నవీన్ మిత్తల్, సందీప్ కుమార్ సుల్తానియా, రిజ్వి, దాన కిషోర్, జితేందర్, డీఎస్ చౌహాన్, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

Ministers Review on Nalgonda Irrigation Projects : మరోవైపు నల్గొండ జిల్లా సాగు నీటి ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేయాలని మంత్రులు ఉత్తమ్ కుమార్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు సమీక్ష జరిపారు. లక్ష ఎకరాలకు నీరందించే ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లముల ఎత్తిపోతల ప్రాజెక్టు కాలువలతో పాటు, పెండింగులో ఉన్న ఎస్ఎల్​బీసీ ఎత్తిపోతల ప్రాజెక్టు కాలువలు, ఎస్​ఎల్​బీసీ టన్నెల్ పనులను వెంటనే చేపట్టాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి ఆదేశించారు.

ఫార్ములా ఈ రేస్‌ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం లేదు: భట్టి విక్రమార్క

Minister Comments on Nalgonda Irrigation Projects : గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎస్​ఎల్​బీసీ కాలువలను పూర్తిచేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం వాటి నిర్వహణ చేపట్టలేదన్నారు. పదేళ్లుగా కాలువల నిర్వహణ, మరమ్మతులు లేక పూడికలతో నిండిపోయని అన్నారు. కాలువలకు మరమ్మత్తులు చేపట్టి ఈ సంవత్సరంలోనే అందుబాటులోకి తీసుకురావాలని ఉత్తమ్ కుమార్​రెడ్డి ఆదేశించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టుకు రెండు దశల్లో లక్ష ఎకరాలకు భూసేకరణ చేపట్టడంతో పాటు కాలువలను తవ్వే పనులను పూర్తి చేసి లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీళ్లు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Nalgonda Irrigation Projects : గత ప్రభుత్వం నల్గొండ సాగునీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం చేసిందని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆరోపించారు. మెజారిటీ పనులు పూర్తయిన ఎస్​ఎల్​బీసీ ప్రాజెక్టును కూడా నిర్లక్ష్యం చేశారని, తాను ఎన్నోసార్లు అసెంబ్లీలో మాట్లాడినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో ఉందని మంత్రి అన్నారు.

ఉదయ సముద్రం మొదటి దశ భూసేకరణకు సుమారు రూ.100 కోట్లు, పనుల కోసం మరో రూ.100 కోట్లను త్వరగా విడుదల చేస్తామని మంత్రులు తెలిపారు. ఏడాదిలో మొదటి దశను పూర్తి చేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

దిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి - కౌన్సిల్ సభ్యుల ఎంపిక, నామినేటెడ్ పదవులపై అధిష్ఠానంతో చర్చ

Last Updated : Jan 12, 2024, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.