ETV Bharat / state

ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక ఇంజినీర్: వేముల

ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక ఇంజినీర్ అని కొనియాడారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నవాబ్ అలీ బహదూర్ జంగ్ 142వ జయంతి సందర్భంగా హైదరాబాద్ విశ్వేశ్వరయ్య భవన్​లో నిర్వహించిన తెలంగాణ ఇంజినీర్ల దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.

కేసీఆర్ సామాజిక ఇంజినీర్: వేముల
author img

By

Published : Jul 11, 2019, 6:11 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ రోజూ మిషన్ భగీరథ, 24 గంటల విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టుల పురోగతి తెలుసుకోకుండా కనీసం అల్పాహారం కూడా తీసుకోరని రహదార్లు, భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాత్రి పడుకునే ముందు కూడా ఈ ప్రాజెక్టుల గురించి తెలుసుకుంటారని పేర్కొన్నారు. నవాబ్ అలీ బహదూర్ జంగ్ 142వ జయంతి సందర్భంగా హైదరాబాద్ విశ్వేశ్వరయ్య భవన్​లో నిర్వహించిన తెలంగాణ ఇంజినీర్ల దినోత్సవంలో మంత్రి.... ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర ఎంతగానో ఉందన్న మంత్రి... మిషన్ భగీరథ, నిరంతర విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టులు వారి శ్రమతోనే పూర్తయ్యాయన్నారు.

ఇంజినీర్ అయినందుకే తనకు సంబంధిత శాఖల బాధ్యతలను సీఎం అప్పగించారని తెలిపారు. నవాబ్ అలీ జంగ్ తరహాలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల జీవితాలు బాగుపడాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని... త్వరలోనే ఆ రోజులను చూస్తామని ప్రశాంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. నవాబ్ అలీ జంగ్ జీవితచరిత్రను పాఠ్యాంశంగా చేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. సర్వీసు కాలంలో విలువైన సేవలు అందించిన విశ్రాంత ఇంజినీర్లు పెంటారెడ్డి, వెంకటరామారావు, జ్ఞానేశ్వర్, కిషన్​లకు నవాబ్ అలీ జంగ్ జీవితసాఫల్య పురస్కారాలను అందజేశారు.

కేసీఆర్ సామాజిక ఇంజినీర్: వేముల

ఇవీ చూడండి: టీమిండియాకు బై చెప్పేసిన ఫర్హాట్..

Intro:శ్రీ షిరిడి సాయిబాబా గురు పౌర్ణమి మహోత్సవం

హైదరాబాద్:

దక్షిణ శిరిడి గా విరాజిల్లుతున్న శిరిడి సాయిబాబా సంస్థాన ట్రస్ట్ దిల్షుక్నగర్ గురుపౌర్ణమి ఉత్సవాలు ఆదివారం నుండి బుధవారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అని ఆలయ చైర్మన్ గంగాధర్ పేర్కొన్నారు. కలశ స్థాపన,అఖండ దీపారాధన,భక్తులచే లక్షనామార్చన, సామూహిక గురుపాదుక పూజ,శ్రీ సాయి సత్య వ్రతములు నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.

Body: ఈ ఉత్సవాలను పురస్కరించుకొని సంస్థాన్ దేవస్థానం వివిధ పుష్పములతో రంగు రంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించుట జరుగుతుందని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారుగా 80 వేల మంది భక్తులు శ్రీ సాయి బాబా వారిని దర్శించుకునేందుకు సంస్థ తరుపున ప్రత్యేక ఏర్పాట్లు చేశామని సాయిబాబా దర్శించుటకు అన్నదాతలు, స్త్రీలకు పురుషులకు, వేర్వేరుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వికలాంగులకు,చిన్న పిల్లల తల్లులకు,వయోవృద్ధులకు,గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగిందని భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు 100 మంది సాయి చైతన్య కాలేజీ విద్యార్థులు,300 మంది సంస్థానం వాలంటరీ బృందం ప్రత్యేక పోలీసు బృందం ట్రాఫిక్ సిబ్బంది జిహెచ్ఎంసి వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిన గురుపౌర్ణమి సందర్భంగా సాయి బాబా వారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ప్రత్యేక అన్నప్రసాదం మెగా థియేటర్ ఆవరణలోకి భవనం లో లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

Conclusion:సాయి బాబా ని దర్శించుకునేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు.

బైట్: బి .గంగాధర్
ఆలయ చైర్మన్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.