హైదరాబాద్లోని అస్మాన్ఘాట్ మల్లికార్జున స్వామి వారి ఆలయం జనసంద్రమైంది. ఏటా ధనుర్మాసంలో నిర్వహించే జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇవాళ జరిగిన కల్యాణానికి పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మల్లన్నస్వామి కల్యాణానికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి... ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే ఏడాది మల్లన్నస్వామి కల్యాణోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వమే నిర్వహిస్తుందని తలసాని హామీ ఇచ్చారు.
దేవాలయాభివృద్ధికి ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. త్వరలో ఓ కమిటీ వేసుకుని నిధుల కోసం తనను సంప్రదించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్ శర్మ, స్థానిక కార్పొరేటర్ స్వర్ణలతా రెడ్డి, చంపాపేట్ కార్పొరేటర్ సామ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'పతంగులపై కారు గుర్తు పెట్టి ప్రచారం చేయండి'