ETV Bharat / state

GHMC : నాలా సమస్యా..? ఫిర్యాదు చేయండి! - telangana news

గతేడాది మహానగరంలో వరదలు సృష్టించిన బీభత్సాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ప్రభుత్వం ముందే స్పందించింది. ముంపు ముప్పు తప్పించేందుకు చర్యలు చేపట్టింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని నాలాల్లో పూడికతీత పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కోట్లు కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. నాలాల్లో ఏదైనా సమస్యలుంటే నేరుగా పౌరులే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ను కేటాయించారు.

నాలా సమస్యా..? ఫిర్యాదు చేయండి!
నాలా సమస్యా..? ఫిర్యాదు చేయండి!
author img

By

Published : Jun 14, 2021, 8:21 AM IST

జీహెచ్‌ఎంసీ పరిధిలో నాలాల్లో పూడికతీత పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కోట్లు కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఈ పనుల్ని ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారని చెప్పారు.

ముంపు ప్రాంతాల్లో నేటి నుంచి 19వ తేదీ వరకు ప్రజాప్రతినిధులు, బల్దియా అధికారులు నాలాల్లో పూడికతీత, అభివృద్ధి పనుల్ని క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించనున్నారు. ఆయాప్రాంతాల్లో నాలాల పూడికతీత సవ్యంగా జరగకుంటే, నాలాల్లో ఏదైనా సమస్యలుంటే నేరుగా పౌరులే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ను కేటాయించారు.

ఫిర్యాదులు పంపాల్సిన నంబర్‌ 98480 21665

నాకూ వ్యక్తిగతంగా పంపొచ్చు

అధికారులతో కలిసి బేగంపేట నాలాను సందర్శించనున్నట్లు మంత్రి తెలిపారు. పనులపై ఫిర్యాదుల్ని వాట్సాప్‌ నంబర్‌కు పంపాలని.. నేరుగా తనకే ఫిర్యాదు చేయాలనుకునేవారు 98482 82309, 98480 98166 నంబర్‌లకు పంపాలని మంత్రి సూచించారు.

- మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

ఇదీ చదవండి: Yadadri : తెలంగాణకు మకుటాయమానం.. యాదాద్రి ఆలయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.