కాలనీ సంఘాలు సమస్యల పరిష్కారానికి ముందుకొస్తే... త్వరితగతిన ఆయా కాలనీలు అభివృద్ధి చెందుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పార్క్లో 6 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వాకింగ్ ట్రాక్ ఇతర అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
కాలనీ అభివృద్ధి సంఘాల నేతలు .. కాలనీ వాసులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఏవైన సమస్యలుంటే... తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి నిధుల కొరత లేదని చెప్పారు.
ఇదీ చూడండి: అయోధ్య శోభాయమానం- భూమిపూజకు ముస్తాబు